హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

VKB: ​సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన సందర్భంగా వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్‌లో పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. 6 గ్యారెంటీలపై నిలదీస్తారనే భయంతోనే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టయిన వారిలో మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు అక్కిడి కేశవరెడ్డి, మల్లేష్, హనుమంతు గౌడ్ ఉన్నారు.