SRPT: ముత్యాలమ్మ పండుగ సందర్భంగా నడిగూడెం మండలం సిరిపురంలో అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా శుక్రవారం చల్లగూడు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. కుమ్మరి, చాకలి, మంగలి, మాదిగ కులస్తులు డప్పు వాయిద్యాలతో చల్లగూడు ఎత్తుకుని గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగారు. ఇంటింటి నుంచి పెరుగు, అన్నం, పసుపు, కుంకుమ సేకరించి ముత్యాలమ్మ తల్లికి సమర్పించారు.
తెలంగాణ
సిరిపురంలో సంప్రదాయంగా చల్లగూడు కార్యక్రమం


