హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్లలో మద్యం దందా..!

KDP: పోరుమామిళ్లలోని నాలుగు మద్యం షాపుల్లో బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధర చెల్లించి మద్యం కొనుగోలు చేయాల్సి వస్తోందని మందుబాబులు వాపోతున్నారు. బద్వేలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఎమ్మార్పీ ధరకే విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.