హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకృష్ణుడు, రాధమ్మల వేషధారణలతో చిన్నారులు

SS: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలు, పాఠశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలలో పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధమ్మల వేషధారణలతో అలరించారు. చిన్నారి కృష్ణుల నృత్యాలు, ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఉట్టి ఉత్సవాలను నిర్వహించారు.