హైదరాబాద్: 28°C
తెలంగాణ

గీతాశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

MNCL: జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకొని గీతాశ్రమ ప్రధాన పూజారి మౌన స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆశ్రమంలోని శ్రీకృష్ణుని విగ్రహాన్ని వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుని భక్తి పాటలు, భజనలు ఆలపిస్తున్నారు.