హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జైలు నుంచి పరారైన ఖైదీ అరెస్ట్

అన్నమయ్య: కడప సెంట్రల్ జైలు నుంచి పరారైన ఖైదీ వీరారెడ్డిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న అతడు జైలు వద్ద తప్పించుకుని తిరుపతికి చేరుకున్నాడు. అక్కడ అదుపులోకి తీసుకున్న పోలీసులు రాయచోటి పోలీసులకు అప్పగించారు. ఏఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ అయాన్ భాష, హోంగార్డు మధుబాబు అతడిని రాయచోటికి తరలించారు.