PPM: సాలూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ కామాక్షమ్మ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తల్లికి వివిధ జలాలతో అభిషేకాలు చేసి, వైభవంగా అలంకరణ చేపట్టి విశేషంగా పూజలు చేపట్టారు. సాలూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులు అధిక సంఖ్యలో తల్లిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ కామాక్షమ్మ ఆలయంలో శ్రావణమాస పూజలు


