హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కబడ్డీ ఆడిన మున్సిపల్ ఛైర్మన్

NRML: నిత్యం రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండే భైంసా మున్సిపల్ ఛైర్మన్ తుమోల్ల దత్తాత్రి కబడ్డీ ప్లేయర్ అవతారం ఎత్తారు. భైంసాలోని కిసాన్ గల్లీలో గురువారం రాత్రి హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలకూ హాజరై ప్రారంభించారు. తోటి కౌన్సిలర్లు, నాయకులతో కలిసి జట్టుగా ఏర్పడి ఆటగాళ్ళతో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.