హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

అన్నమయ్య: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ధర్మాన్ని కాపాడే శ్రీకృష్ణుని సందేశం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరారు.