హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంట్లో నాగుపాము.. భయంతో పరుగులు

VZM: రేగిడి ఆమదాలవలస మండలం ఉణుకూరు గ్రామంలో నిన్న రాత్రి వంజరపు శివయ్య అనే వ్యక్తి ఇంట్లోకి నాగుపాము చొరబడింది. పామును గమనించిన శివయ్య కుటుంబీకులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. పోరాంలో ఉన్న స్నేక్ క్యాచర్ రమణయ్యకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. పామును కొండప్రాంతంలో విడిచి పెడతానని ఆయన తెలిపారు.