హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు

PDPL: ఓదెల మండలం పొత్కపల్లి పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈఓ వై. రమేష్‌ అభినందించారు. జోనల్‌, జిల్లా స్థాయిలో మండలానికి మంచి గుర్తింపు వచ్చేలా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీల విజయవంతానికి సహకరించిన పాఠశాల సిబ్బంది, పీఈడీ, పీఈటీ బృందాన్ని అభినందించారు.