KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది.నీటిమట్టం పడిపోవడంతో అధికారులు సాగర్ నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనికి తోడు ఎస్ఆర్ఎస్పీ వరద నీరు తోడవడంతో గురువారం సాయంత్రానికి నీటిమట్టం 22.5 అడుగులకు చేరింది. ఇక్కడి పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులు.ప్రస్తుతం ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడుతున్నారు.
తెలంగాణ
నిండుకుండలా పాలేరు జలాశయం..!


