హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సరీల నిర్వహణపై విమర్శలు

NRML: కుబీర్‌ మండలంలోని పలు గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్లగొండలో నర్సరీ పూర్తిగా ఖాళీ కాగా, డోడర్నా తండా-5లో బోర్డు ఉన్నా మొక్కల జాడలేదు. సాయినగర్‌లో 80 శాతం నర్సరీ ఖాళీగా ఉంది. మొక్కల పెంపకం, నాటడం, పంపిణీలో నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.