NRPT: మద్దూరు మండలంలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం మద్దూరులో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను కూడా సీఎం పరిశీలించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ
నేడు మద్దూరుకు సీఎం రేవంత్‌రెడ్డి


