హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు TTD ఆధ్వర్యంలో గో పూజలు

MBNR: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది కేంద్రాల్లో గోపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే కార్యక్రమ సమన్వయకర్త డా. ఉత్తరపల్లి రామాచారి తెలిపారు. హిందూ సంప్రదాయంలో గోవును ప్రత్యక్ష దైవంగా కొలవడం ఆచారంగా వస్తోందన్నారు. గో విశిష్టతను మరింతగా భక్తులకు తెలియజేస్తూ పవిత్రకార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.