హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు కేఎంసీలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు..!

KRNL: కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం స్టేట్‌ కోటా అడ్మిషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ వరకు సెలవు రోజుల్లోనూ ప్రక్రియ కొనసాగుతుందని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చిట్టి నరసమ్మ తెలిపారు. తొలిరోజు 34 మంది విద్యార్థులు చేరారు. నేషనల్‌ కోటా అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్నారు.