GDWL: సుంకేసుల జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో ప్రజలకు తాగునీటి గండం పొంచి ఉంది. రాజోలిలోని కొన్ని కాలనీలకు ఈ పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు లేక తుంగభద్ర నదిలో వరద లేకపోవడంతో జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో ట్యాంకు వద్ద దాదాపు మూడున్నర మీటర్ల మేర నీరు తగ్గింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న 15 రోజుల్లో మోటార్లకు నీరందక, సరఫరా ఆగిపోయే ప్రమాదం నెలకొంది.
తెలంగాణ
సుంకేసులకు తగ్గిన నీటిమట్టం


