హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి'

ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో DMHO డా.రామారావు గురువారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య, పంచాయతీ రాజ్, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.