హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు: సీఐ

KMR: వినాయక శోభాయాత్ర సందర్భంగా డీజేలకు ఇలాంటి అనుమతులు లేవని కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ చెప్పారు. గురువారం రామారెడ్డి మండల కేంద్రంలో వినాయక ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా వినాయకులను నిమజ్జనం చేయాలని ఆయన సూచించారు.