హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా తిరుపతి

JGL: రాయికల్ పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా గురువారం ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం అందించనుంది. ఎంపికపై MEO ఎస్. రాఘవులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.