SRPT: నాగారం మండలం ఫణిగిరిలో 2023లో అల్లయ్య హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు పడింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద గురువారం తీర్పు వెల్లడించారు. బోనెపల్లి నవీన్, నాగరాజు, వెలుపుల వెంకన్న, ఏమండ్ల అక్షయ్‌కు యావజ్జీవ శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ నరసింహ తెలిపారు.
తెలంగాణ
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు!


