ASF: ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్‌కు చెందిన బండే సుజాతకు గురువారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆసిఫాబాద్ ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో సిబ్బంది అంబులెన్సులోనే ప్రసవం చేశారు. సుజాత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
తెలంగాణ
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


