హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందీలో 100% ఫలితాలు.. టీచర్‌కు అవార్డు

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం ZPHS హిందీ అసిస్టెంట్, FAC హెచ్ఎం MD తాహెర్పాషా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 32 ఏళ్ల సర్వీసులో తాను పనిచేసిన ప్రతిస్కూల్లో హిందీలో వంద శాతం ఫలితాలు సాధించడం విశేషం. టెక్స్ట్ బుక్ రైటర్గానూ సేవలు అందిస్తున్న ఆయన శుక్రవారం విజయవాడలో CM చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు.