ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 5న నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించనున్న గురుపూజోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. గురువులను సత్కరించి, వారి సేవలను గౌరవించే ఈ విశిష్ట ఉత్సవంలో పాల్గొని ఉపాధ్యాయులను అభినందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే దగ్గుపాటికి DEO ఆహ్వానం


