హైదరాబాద్: 28°C
తెలంగాణ

PMJJBYతో కుటుంబానికి రూ.2 లక్షల సాయం

SDPT: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద అనారోగ్యంతో మృతి చెందిన మిట్టపల్లికి చెందిన ఎడ నిరంజన్ కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును ఎస్బీఐ మిట్టపల్లి శాఖ అందజేసింది. నామినీ, ఆయన తండ్రి నర్సింలుకు బ్యాంకు మేనేజర్ రమేష్, సిబ్బంది ఆధ్వర్యంలో సిఎఫ్ఎల్ సిద్దిపేట అర్బన్ ద్వారా చెక్కు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేష్, కౌన్సిలర్లు శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.