హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొన్నాల రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల రాజీవ్ రహదారిపై గురువారం మొబైల్ మినీ బస్సు, మొబైల్ వ్యాన్ అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే వాహనాల్లో ఉన్న ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.