గద్వాల జిల్లాలోని కూరగాయల నర్సరీలన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని లైసెన్స్ పొందాలని జిల్లా ఉద్యాన అధికారి జి.రాజ్ కుమార్ సూచించారు. గురువారం గద్వాలలోని పలు నర్సరీలను ఆయన పరిశీలించారు. అనుమతులు లేకుండా నాసిరకం నారు అమ్మితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు లైసెన్స్ ఉన్న నర్సరీల నుంచే నారు కొని, బిల్లులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
నర్సరీలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి


