హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈవో సుదర్శన్‌రెడ్డికి ఎస్‌ఐఆర్ నోటీసు

TG: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రాష్ట్ర సీఈవో సుదర్శన్‌రెడ్డికి నోటీసు వచ్చింది. గత ఎస్‌ఐఆర్‌లో ఇంటిపేరు సరిపోలకపోవడంతో అనామలీ ఓటరుగా నోటీసు జారీ అయింది. దీంతో కార్వాన్ నియోజకవర్గ ఈఆర్‌ఓకు సుదర్శన్‌రెడ్డి పాస్‌పోర్ట్‌ను ధ్రువీకరణ పత్రంగా సమర్పించి వివరణ ఇచ్చారు. ప్రస్తుత జాబితాలో ఇంటిపేరు పూర్తిగా ఉండటంతో ఈ సమస్య తలెత్తింది.