హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: స్టీరింగ్‌కు ముద్దు పెట్టి.. భావోద్వేగ వీడ్కోలు

కేరళ KSRTCలో ఇడుక్కి కుమిలి డిపో డ్రైవర్ పాల్ కురియన్ నిన్న తన చివరి డ్యూటీని పూర్తి చేసుకున్నారు. సర్వీస్ ముగిశాక బస్సును పార్క్ చేసి, స్టీరింగ్‌కు ముద్దుపెట్టి సెల్యూట్ చేస్తూ ఆయన వీడ్కోలు పలికారు. ఏళ్లుగా తాను నడిపిన బస్సుతో ఆయనకున్న అనుబంధాన్ని చాటే ఈ భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.