హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ స్టేషన్లకు విలువైన వాహనాలు అందజేత

E.G: P4 విధానంలో గోపాలపురం, దేవరపల్లి పోలీస్ స్టేషన్లకు రెండు బొలెరో నియో వాహనాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గురువారం అందజేశారు. ఒక్కో వాహనం రూ.12 లక్షల విలువ కాగా, మొత్తం రూ.24 లక్షల వ్యయంతో సమకూర్చారు. అత్యవసర సమయాల్లో పోలీసులు వేగంగా స్పందించేందుకు వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.