కోనసీమ: మండపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకోనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని కార్యాలయ వర్గాలు కోరాయి. వినతిపత్రాల్లో మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని సూచించారు.
వార్తలు
నేడు మండపేటలో ఎమ్మెల్యే గ్రీవెన్స్


