హైదరాబాద్: 28°C
వార్తలు

'రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమే'

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ సంకేతాలు ఇచ్చారు. కీవ్ పర్యటనలో ఉన్న జైశంకర్.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో కలిసి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం యుద్ధభూమిలో లేదన్నారు. చర్చలు, దౌత్యం ద్వారానే సాధ్యమని జైశంకర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.