హైదరాబాద్: 28°C
వార్తలు

ఫోన్ మాట్లాడాలంటే.. 3-4 కి.మీ. వెళ్లాల్సిందే..!

ప్రస్తుత డిజిటల్ యుగంలో పలు మారుమూల గ్రామాలలో నేటికీ మొబైల్ సిగ్నల్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హర్యానాలోని నవాజ్‌పూర్‌లో మొబైల్ నెట్‌వర్క్ ఇప్పటికీ అందుబాటులో ఉండటం లేదు. ఫోన్‌ కాల్స్ చేయాలంటే గ్రామానికి 3-4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.