హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

KKD: పాదగయలో టోకెన్ల రచ్చ.. భక్తుల ఆగ్రహం

KKD: పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం టోకెన్ల పంపిణీ మరోసారి వివాదానికి గురైంది. జనసేన నేతల చేతుల్లో 10 వేల టోకెన్లు ఉన్నాయని, జనసేన సభ్యుత్వం ఉన్నవారికే అవి పంపిణీ చేస్తున్నారని మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరిగే శ్రావణ శుక్రవారం వ్రతంలో పాల్గొనేందుకు టోకెన్ల కోసం ఉదయం నుంచి వేసి చూసిన దొరకడం లేదని జనసేనపై మండిపడుతున్నారు.