హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి'

VSP: డీఎస్సీలో అక్రమాల బండారం బయటపడిందని గురువారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా, పేపర్ లీకేజీ ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ప్రభాకర్ గౌడ్‌కు టెట్ అర్హత లేకుండా టీచర్ పోస్ట్ ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు.