హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెట్టుగోళ్లపల్లి చేరిన గోదావరి జలాలు'

AKP: రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లి గ్రామానికి గోదావరి జలాలు పోలవరం కాలువ ద్వారా గురువారం చేరాయి. గోదావరి జలాలను చూసిన గ్రామస్తులు ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి అల్లు నరసింహమూర్తి ఆధ్వర్యంలో గ్రామస్తులు గోదావరి జలాలకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి పూజలు చేశారు. గోదావరి జలాలు ద్వారా తమ భూములకు సాగునీరు అందుతుందన్నారు.