హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించాలి'

AKP: మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను వెంటనే భర్తీ చేసి, తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు, రోడ్లు, కాలువల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు ప్రత్యేక అధికారి, ఆర్డీవో కే. మాధురికి గురువారం వినతిపత్రం అందజేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి ఏప్రాన్లు, సబ్బులు, నూనెలు, దుస్తులు, గ్లౌజులు అందించాలని కోరారు.