హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకనాథం అరెస్ట్‌ వెనుక కుట్ర: భూమన

TPT: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్‌ వెనుక కుట్ర, కుతంత్రం, పన్నాగం ఉందని మాజీ టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. టీటీడీలోని కొందరు అధికారులు, చైర్మన్‌తో కుమ్మక్కై లోకనాథం యాదవ్‌ను బలిచేశారని విమర్శించారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరు లేదని, విచారణకు కూడా పిలవలేదని పేర్కొన్నారు.