హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు అందుబాటులోకి గోడౌన్లు'

PPM: రైతులకు నిల్వ సౌకర్యాలు కల్పించేందుకు నిర్మిస్తున్న MPFC గోడౌన్లను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని జేసీ ఆర్‌. వైశాలి అధికారులను గురువారం ఆదేశించారు. ఇప్పటికే AIF పథకం కింద మంజూరైన 20 గోడౌన్లలో 15 పూర్తయ్యాయని పేర్కొన్నారు. వాటికి విద్యుత్, నీరు తదితర మౌలిక వసతులు కల్పించి రైతులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.