హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యం నిల్వ చేసిన రైతులకు రుణ సదుపాయం'

కృష్ణా: మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వ చేసిన రైతులకు రైతుబంధు పథకం ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు దివి ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం నాగాయలంక మార్కెట్ యార్డ్ ఆవరణలో అవనిగడ్డకు చెందిన రైతు అన్నపరెడ్డి వెంకటేశ్వరరావుకు రూ.2 లక్షల రుణం చెక్ అందజేశారు. రుణం పొందిన రైతులు ఆరు నెలల వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.