KDP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. గొడవలు, వివాదాలకు పాల్పడకుండా రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలి: సీఐ


