కృష్ణా: తోట్లవల్లూరు (మం) యాకమూరులో SASCI గ్రాంట్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు పామర్రు MLA వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నాణ్యతతో నిర్ణీత గడువులోగా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


