హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగునీటి పథకానికి మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి

సత్యసాయి: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మంత్రి సత్యకుమార్ కలిసి వినతిపత్రం అందించారు. సీబీఆర్ నుంచి పీఏబీఆర్ కుడి కాలువ చివరి ప్రాంతానికి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ పథకం అమలైతే బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో 45,800 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 48 చెరువులు నీటితో నిండే అవకాశం ఉందని వివరించారు.