హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

శ్రీకాకుళం పట్టణం అరసవల్లి కూడలిలోని ఓ విద్యాలయంలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వ్యవస్థాపకులు అంధవరపు సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు కృష్ణ, గోపికల వేషధారణలో అలరించారు. అనంతరం ఉట్టి ఉత్సవం నిర్వహించారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ప్రపంచానికే జగద్గురువు అయ్యారని సూరిబాబు అన్నారు.