హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం వినతి

ELR: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీవీ భువనేశ్వరి, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.