హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాకాహారంలోనూ మెండుగా పోషకాలు'

W.G: కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి శాకాహారంలో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీమన్నారాయణ తెలిపారు. జాతీయ పోషకాహార వారోత్సవాన్ని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శాకాహారంతో అవసరమైన విటమిన్లు లభిస్తాయని, ప్రజలు ఇంటి ఆవరణలో ఆకుకూరలు పెంచుకోవాలని సూచించారు.