హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో రేపు కృష్ణాష్టమి వేడుకలు

KDP: పులివెందుల రింగ్‌రోడ్డు సమీపంలోని శ్రీకృష్ణ ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం స్వామివారి కళ్యాణం, ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం ఉట్టి కొట్టే కార్యక్రమం, సాయంత్రం కోలాటం, క్లాసికల్‌ డ్యాన్స్‌, రాత్రి ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం చేయనున్నారు.