NLR: ఉదయగిరిలో MSME యూనిట్ ఏర్పాటుకు సర్వే నంబర్ 995లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు APM షారా స్రవంతి తెలిపారు. ఇందులో రైతు ఉత్పత్తిదారుల సమైక్య కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుకు రూ. 15 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. యూనిట్ అందుబాటులోకి వస్తే చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'MSME యూనిట్ ఏర్పాటుకు స్థల సేకరణ'


