హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లపై గోకవరంలో గ్రామసభ

E.G: గోకవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో మోతుకూరి గోవిందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఓటర్ల రిజర్వేషన్‌, కేంద్రాల్లో చేపట్టాల్సిన సదుపాయాలు, ఎన్నికల విధివిధానాలను వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పులపర్తి బుజ్జి పాల్గొన్నారు.