హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ పోస్టులకు మౌఖిక పరీక్షలు

అన్నమయ్య: రాయచోటి ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాలి పోస్టులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల భర్తీకి ఈ పరీక్షలు చేపట్టారు. సంబేపల్లి, రాయచోటి, చిన్నమండెం మండలాల్లోని పోస్టులకు అభ్యర్థులను పరీక్షించారు. ఖాళీ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.